సర్‌ప్రైజ్ ఆలస్యం.. రామ్ చరణ్‌కు ఎన్టీఆర్ క్షమాపణలు

-

సర్‌ప్రైజ్ ఆలస్యం కానుందని, అందుకు రామ్ చరణ్‌కు క్షమాపణలు చెప్పాడు ఎన్టీఆర్. ఇంతకీ ఆలస్యానికి కారణాలేంటో ఓ సారి చూద్దాం. రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్బంగా.. రామరాజు కోసం భీమ్ ఉన్నాడంటూ..ఓ సర్‌ప్రైజ్ ఇవ్వబోతోన్నట్టు నిన్న ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. పైగా ఎప్పటికీ మరిచిపోలేని విధంగా ఉంటుందని ట్వీట్ చేశాడు.

ఎన్టీఆర్ చేసిన ఆ ట్వీట్‌కు రామ్ చరణ్ స్పందిస్తూ.. అవునా.. అయితే నేను సరైన సమయానికే ట్విట్టర్ ప్రపంచంలోకి వచ్చాను..లేదంటూ నీ సర్‌ప్రైజ్‌ను మిస్ అయ్యేవాడిని..రేపటి వరకు ఆగలేకపోతోన్నా.. అని ట్వీట్ చేశాడు. ఇక పది గంటలు ఎప్పుడు అవుతుందా? అని ఎదురుచూసే కళ్లకు నిరాశను కలిగించే మరో ట్వీట్ చేశాడు ఎన్టీఆర్.

నన్ను క్షమించి రామ్ చరణ్ బ్రో.. నిన్న రాత్రి రాజమౌళి కోరడంతో నీకు ఇవ్వాల్సిన గిఫ్ట్‌ను ఆయన చేతిలో పెట్టాను.. నీకు తెలిసిందే కదా ఆయన చేతిలోకి వెళితే ఎలా ఉంటుందో.. కొంచెం ఆలస్యం అవుతుందని ట్వీట్ చేశాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news