జూ ఎన్టీఆర్ గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఇప్పటికీ తెలుగు సినిమా హీరోలలో ఎవరు బెస్ట్ డాన్సర్ అంటే చాలా మంది జూ ఎన్టీఆర్ పేరే చెబుతారు. రీసెంట్ గా రాజ మౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ మూవీ లో తన నటన తో భారత దేశంలో లోనే కాక ,హాలీవుడ్ వాళ్ళను సైతం ఆశ్చర్యపరిచాడు.
కాని తర్వాత సినిమా గురించి అప్డేట్ లేక ఫ్యాన్స్ నిరుస్తాహం గా వున్నారు. తాను చేయబోయే చిత్రం 30 వది కావడంతో నందమూరి అభిమానులే కాదు, టాలీవుడ్ సినీ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ప్రేక్షకులు చూస్తున్నారు.
ఇక ఈ సినిమా కథ మెడికల్ మాఫియా చూట్టూ తిరుగుతుంది అని తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పలికే డైలాగ్స్ హైలైట్ గా ఉండబోతున్నాయి అని అంటున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు తీసుకెళ్ళాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. అలాగే ఈ సినిమాని వచ్చే దసరాకి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.