మనీష్ సిసోడియా కస్టడీపై తీర్పు రిజర్వ్.. బెయిల్ కోసం పిటిషన్

-

ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఏ1 గా ఉన్న డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను కస్టడీకి ఇప్పించాలన్న పిటిషన్ ను కోర్టు రిజర్వు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం లో అరెస్ట్ అయిన మనిష్ సిసోడియాను రౌస్ అవేన్యూ ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరుపరిచింది సిబిఐ. ఈ కేసులో ఆయనను విచారించేందుకు ఐదు రోజుల కస్టడీ ఇవ్వాలని కోరింది. తాము అడిగే ప్రశ్నలకు సిసోడియా సరిగ్గా సమాధానాలు ఇవ్వడం లేదని, మొబైల్ ఫోన్లు కూడా మార్చారని కోర్టుకు వివరించింది.

ఈ కేసులో ఆయనదే కీలక పాత్ర అని సిబిఐ పేర్కొంది. అయితే స్పెషల్ కోర్టు జడ్జి ఎంకే నాగ్ పాల్ తీర్పును రిజర్వులో ఉంచారు. మరోవైపు తనకు బెయిల్ ఇవ్వాలంటూ రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మనీష్ సిసోడియా. తన భార్యకు ఆరోగ్యం బాలేదని, సిబిఐ కోరినప్పుడల్లా విచారణకు హాజరవుతారని పిటిషన్ లో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news