జగ్గారెడ్డికి ఝలక్ ఇచ్చిన కేటుగాళ్లు..లేడీ డీపీతో ఫేస్ బుక్ క్రియేట్ చేసి దారుణం !

-

కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఊహించని పరిణామం ఎదురైంది. ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేరుతో ఫేక్‌ ఫేస్‌ బుక్‌ ఐడీ క్రియేట్‌ చేశారు కొంత మంది కేటుగాళ్లు. ఆ ఫేస్‌ బుక్‌ డీపీగా ఒక అమ్మాయి ఫోటోను పెట్టారు. ఈ విషయం ఎమ్మెల్యే జగ్గారెడ్డి దృష్టికి రావడంతో… ఆయన అలర్ట్‌ అయిపోయారు. తన అనుచరులందరినీ.. అప్రమత్తం చేశారు..

”నా పేరు మీద ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొత్త ఫేస్‌ బుక్‌ ను క్రీయేట్‌ చేశారు. ఈ ఫేస్ బుక్‌ డీపీగా అమ్మాయి ఫోటో పెట్టారు. అలాగే కొన్ని తప్పుడు ఫోటోలు పెట్టి నా పేరును డ్యామేజ్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారు.ఇవాళ నేను సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. నా పేరుతో కొత్త క్రియేట్‌ చేసిన ఫేస్‌ బుక్‌ ఐడీ నాది కాదు.. సంగారెడ్డి నియోజక వర్గ ప్రజలు ఎవరూ కూడా అస్సలు మోసపోవద్దు. సైబర్‌ నేరగాళ్ల పట్ల చాలా అప్రమత్తంగా ఉండండి..ఆ అకౌంట్ తో మెసేజ్‌ లు పెడితే.. పట్టించుకోకండి” అంటూ జగ్గారెడ్డి క్లారిటీ ఇవ్వడంతో.. పాటు ప్రజలను అలర్ట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news