రైలు కింద ప‌డి జూనియ‌ర్ ఆర్టిస్ట్ మృతి

-

క‌దులుతున్న రైలు కింద ప‌డి జూనియ‌ర్ ఆర్టిస్టు జ్యోతి రెడ్డి (28) మృతి చెందారు. ఆంధ్ర ప్ర‌దేశ్ లోని క‌డ‌ప జిల్లాకు చెందిన జ్యోతి రెడ్డి హైద‌రాబాద్ లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తుంది. అలాగే జూనియ‌ర్ ఆర్టిస్టు గానూ ప‌ని చేస్తుంది. అయితే జ్యోతి రెడ్డి ఇటీవ‌ల సంక్రాంతి సందర్భంగా సొంత గ్రామం అయిన క‌డ‌ప కు వెళ్లింది. మ‌ళ్లీ హైద‌రాబాద్ కు రైళ్లో తిరుగు ప్ర‌యాణం అవుతున్న స‌మ‌యంలో షాద్ న‌గ‌ర్ వ‌ద్ద రైలు అగింది.

దీంతో రైలు దిగిన జ్యోతి రెడ్డి తిరిగి రైలు ఎక్కుతున్న స‌మ‌యంలో ప్ర‌మాదం జ‌రిగింది. రైలు క‌దులుతుండ‌టంతో జ్యోతి రెడ్డి అదుపు త‌ప్పింది. దీంతో జ్యోతి రెడ్డి క‌దులుతున్న రైలు కింద ప‌డి పోయింది. దీంతో జ్యోతి రెడ్డి కి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో రైల్వే పోలీసులు ఆస్పత్రికి త‌ర‌లించారు. కాగ చికిత్స పొందుతూ జ్యోతి రెడ్డి మ‌ర‌ణించింది. కాగ రైల్వే శాఖ నిర్ల‌క్ష్యం వ‌ల్లే జ్యోతి రెడ్డి మ‌ర‌ణించిందని రాష్ట్ర జూనియ‌ర్ ఆర్టిస్టుల సంఘం ప్ర‌తినిధులు ఆందోళ‌న చెప‌ట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news