యంగ్ టైగర్ ఎన్టిఆర్ మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నాడా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. రాజకీయంగా జూనియర్ ఎన్టీఆర్ కి మైలేజ్ ఉంది. అభిమానులు ఎక్కువగా ఉండటంతో అతను రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో వస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది అనేది పలువురి అభిప్రాయం. రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలియింగ్ ఉంది తారక్. అందుకే రాజకీయ పరిశీలకులు కూడా కోరుతూ ఉంటారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు ఒకటి బయటకు వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ తో త్వరలో చంద్రబాబు సమావేశమయ్యే అవకాశం ఉందని, పాలిట్ బ్యూరోలో చోటు కల్పించే విధంగా అడుగులు వేస్తున్నారని అంటున్నారు. కృష్ణా జిల్లా టీడీపీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందనే ప్రచారం కూడా ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది. సోషల్ మీడియా ఇప్పుడు దీనిపై పెద్ద ప్రచారమే జరుగుతుంది.
ప్రస్తుతం కష్టాల్లో ఉన్న టీడీపీని బయటకు తీసుకురావాలి అంటే జూనియర్ ఎన్టీఆర్ స్టామినా అవసరమవుతుందని చంద్రబాబు భావిస్తున్నారట. త్వరలో ఆయన ఈ విషయమై పార్టీ సీనియర్ నేతలతో కూడా చర్చలు జరిపే అవకాశం ఉందని అంటున్నారు. తెలంగాణా అధ్యక్ష బాధ్యతలు నందమూరి సుహాసినికి అప్పగించాలని చంద్రబాబు భావిస్తున్నారట. ఇది ఎంత వరకు నిజమో చూడాలి.