ఓ వైపు అధికార వైసీపీపై చంద్రబాబు పోరాడుతుంటే…మరోవైపు చంద్రబాబుపై సొంత వాళ్లే పోరాడే పరిస్తితి కనిపిస్తుంది. నెక్స్ట్ ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనే కసితో బాబు పనిచేస్తున్నారు…ఈ వయసులో కూడా కాళ్ళకు బలపం కట్టుకుని మరీ ప్రజల్లో తిరుగుతున్నారు…ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు…వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగడుతున్నారు. అయితే బాబుని సొంత వాళ్ళే ఇంకా వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నారు…ఇప్పటికే టీడీపీలో ఆధిపత్య పోరు ఎక్కువైన విషయం తెలిసిందే…మరో వైపు కేశినేని నాని వ్యవహారం చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా తయారైంది.
ఇదే సమయంలో పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ అంశం బాగా హాట్ టాపిక్ అవుతుంది. గత ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుంచి టీడీపీలో కొందరు…జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి రావాలనే డిమాండ్ ఎక్కువ చేస్తున్నారు. చంద్రబాబుకు వయసు మీద పడిందని, అటు లోకేష్ కు పార్టీని నడిపించే సామర్థ్యం లేదని, కాబట్టి ఎన్టీఆర్ వచ్చి పార్టీ పగ్గాలు చేపట్టాలనే డిమాండ్ పెరుగుతూ వస్తుంది.
అలాగే చంద్రబాబు, లోకేష్ లు ఎక్కడకు వెళ్ళినా…అక్కడ ఎన్టీఆర్ అభిమానులు…ఎన్టీఆర్ జెండాలతో కనిపిస్తున్నారు…అలాగే జై ఎన్టీఆర్, సీఎం ఎన్టీఆర్ అంటూ బాబు ముందే నినాదాలు చేస్తున్నారు. ఇప్పటికే కుప్పంలో ఎన్టీఆర్ అభిమానులు భారీ స్థాయిలో ర్యాలీ కూడా తీసిన విషయం తెలిసిందే. అయితే ఎన్టీఆర్ పేరు వినపడకుండా చేయాలని చంద్రబాబు చూస్తున్నారు..కానీ అభిమానులు ఆగడం లేదు.
తాజాగా గోదావరి జిల్లాల్లో వరద పర్యటనకు వెళ్ళిన బాబుకు జూనియర్ అభిమానుల సెగ తగిలింది. చాలామంది జూనియర్ జెండాలతో బాబు ముందే నినాదాలు చేశారు. ఇలా చంద్రబాబుకు జూనియర్ సెగ ఎక్కువ తగులుతుంది..అయితే ఇదంతా వైసీపీ కుట్ర అని, చంద్రబాబు సామర్థ్యం తగ్గిపోయిందని ఫేక్ ప్రచారం మొదలుపెట్టారని టీడీపీ కార్యకర్తలు అంటున్నారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో భాగంగానే బాబు ఎక్కడకు వెళితే..అక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటూ కొందరు వైసీపీ వ్యక్తులని పెట్టి హడావిడి చేస్తున్నారని చెబుతున్నారు. మరి చూడాలి ఇది వైసీపీ కుట్రా…లేక నిజంగానే ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ కోసం చేస్తున్న డిమాండో.