జంక్ ఫుడ్ తింటున్నారా ? ‘ఆ’ సామర్ధ్యం తగ్గిపోతుందట జాగ్రత్త !

-

నేటి ఆధునిక సమాజంలో జనానికి సరైన తిండి కూడా సమయం ఉండడం లేదు. మనిషి బ్రతికేది ఎందుకు అనేది కూడా ఆలోచించకుండా అప్పటికప్పుడు ఏది దొరికితే అది తినేస్తూ ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా జంక్ ఫుడ్ తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ జంక్ ఫుడ్ అప్పటికప్పుడు రుచికరంగా అనిపిస్తుంది కానీ లాంగ్ రన్ లోకి వచ్చేటప్పటికీ ఆరోగ్యాన్ని నాశనం చేయడంలో ఇదే ఫుడ్ ముఖ్య పాత్ర పోషిస్తుంది.

అయితే జంక్ ఫుడ్ తీసుకునే వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిందే అంటున్నారు డాక్టర్లు. ఎందుకంటే ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకునే పురుషుల యొక్క వృషణాల పరిణామం తగ్గిపోవడంతో పాటు వారి వీర్యకణాల కౌంట్ కూడా భారీగా పడిపోతోందని హార్వర్డ్ యూనివర్సిటీ తాజాగా చేసిన పరిశోధనలో తేలింది. అంటే ఆరోగ్యకరమైన వ్యక్తులతో పోలిస్తే జంక్ ఫుడ్ తీసుకునే వారిలో వీర్య కణాల సంఖ్య 26 మిలియన్స్ తక్కువగా ఉన్నట్టు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news