తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ లోని అందరు పెద్దలను కలిసి మూడు రోజుల పాటు పర్యటించి హైదరాబాద్ చేరుకున్న మరుసటి రోజే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి పయనమవుతూ ఉండటం చర్చనీయాంశంగా మారింది. కెసిఆర్ దాదాపుగా ప్రధాని మోడీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హా చాలా మంది కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి కావలసిన అన్ని నిధులను గురించి చర్చించారని ప్రచారం జరిగింది.
కెసిఆర్ ఇలా హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాడో లేదో వెంటనే బండి సంజయ్ ఢిల్లీకి చేరుకున్నారు.తమ పార్టీ పెద్దలతో సమావేశం అయ్యారు. అలాగే కొద్ది రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్లి బీజేపీ పెద్దలతో సమావేశం అయి వచ్చారు. అక్టోబర్లో దాదాపు మూడు సార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన జగన్ కేసీఆర్ ఢిల్లీ వెళ్లి రాగానే ఈయన కూడా ఢిల్లీ వెళ్లడం ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా చూస్తే తెలుగు రాష్ట్రాల మీద బీజేపీ ఫోకస్ పెట్టినట్టు మాత్రం అర్ధమవుతోంది.