వాళ్లిద్దరూ ఒక్కే తల్లి కడుపులో పుట్టారు. అది కూడా ఒకే కాన్పులో అంటే… కవలలు అన్నమాట. అప్పుడు ఒకే కడుపులో పుట్టి.. ఇప్పుడు పెళ్లితో ఒక్కటయ్యారు. అన్నాచెల్లికి పెళ్లి చేసి వాళ్లను ఒక్కటి చేశారు వారి కుటుంబ సభ్యులు. చదవడానికే అసహ్యంగా ఉంది కదా? సొంత అన్నాచెల్లికి పెళ్లి ఏంది.. అంటారా? అవును.. వాళ్లదో సంప్రదాయం. ఎవరు ఏది చేసినా దానికో కారణం ఉంటుంది కదా. అలాగే.. వీళ్ల పెళ్లికీ ఒక కారణాన్ని చెబుతున్నారు ఆ కవలల తల్లిదండ్రులు. పదండి ఓసారి థాయిలాండ్ లోని బ్యాంకాక్ వెళ్లి అసలు విషయం తెలుసుకుందాం.
సుత్రోన్, పాచారాపర్న్.. ఇద్దరు భార్యాభర్తలు. 2012 లో వాళ్లకు కవలలు పుట్టారు. ఒక మగ, ఒక ఆడ శిశువు జన్మించారు. వాళ్లకు గిటార్, కివీ అని పేరు పెట్టారు. అయితే.. వాళ్లకు పెళ్లి చేయాలని ఇప్పుడు కాదు.. వాళ్లు పుట్టినప్పుడు నిర్ణయించుకున్నారట.
బౌద్ధ ధర్మం ప్రకారం… థాయిలాండ్ లో ఎక్కడైనా సరే.. కవలలు పుడితే.. వాళ్లకు కొంచెం వయసు వచ్చాక పెళ్లి చేస్తారట. వాళ్లిద్దరూ గత జన్మలో ప్రేమికులట. అందుకే తర్వాతి జన్మలో ఇలా కవలలుగా పుడతారట. అది వాళ్ల విశ్వాసం. అందుకే.. ఒకే కాన్పులో పుట్టే మగ, ఆడ పిల్లలకు పెళ్లి చేస్తారు. ఒకవేళ అలా పెళ్లి చేయకపోతే.. వాళ్లకు భవిష్యత్తులో చాలా కష్టాలు వస్తాయట.
అది సంగతి. అందుకే.. ఇద్దరు పిల్లలు కివీ, గిటార్ లను పెళ్లి కొడుకు, పెళ్లి కూతురుగా ముస్తాబు చేసి.. బంధువులను పిలిచి.. అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. వాళ్ల వయసు జస్ట్ ఆరు ఏళ్లు మాత్రమే.