22 రాష్ట్రాల కంటే మేం తక్కువే అప్పులు చేశాం – సీఎం కేసీఆర్

-

22 రాష్ట్రాల కంటే మేం తక్కువే అప్పులు చేశామన్నారు సీఎం కేసీఆర్‌. జి.ఎస్.డి.పి లో రుణ నిష్పత్తి పరిశీలిస్తే .. దేశంలోని 28 రాష్ట్రాల్లో 22 రాష్ట్రాలు మన రాష్ట్రం కన్నా అధికంగా అప్పులు కలిగి ఉన్నాయన్నారు. భారత 75 వ స్వాతంత్ర్య దినోత్సవం, ‘స్వతంత్ర భారత వజ్రోత్సవాల’ సందర్భంగా, గోల్కండ కోటలో జాతీయ జెండా ను ఆవిష్కరించారు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ఐ.టి రంగంలో తెలంగాణ అప్రతిహతంగా ముందుకు దూసుకుపోతోందని తెలిపారు. 1500 కు పైగా పెద్ద, చిన్న ఐ.టి పరిశ్రమలు నేడు హైదరాబాద్ లో కొలువై ఉన్నాయని.. ఐటి రంగ ఉద్యోగాల సృష్టిలో మన రాష్ట్రం కర్ణాటకను అధిగమించి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని వెల్లడించారు.

గత ఏడాది కాలంలో తెలంగాణ ఐటీ పరిశ్రమ 1 లక్ష 55 వేల ఉద్యోగాలు అందించి రికార్డు సృష్టించింది. ఐటీ రంగంలో మొత్తంగా 7 లక్షల 80 వేల ఉద్యోగాల కల్పన జరిగిందని పేర్కొన్నారు. జి.ఎస్.డి.పి లో మన రాష్ట్ర అప్పుల నిష్పత్తి 23.5 శాతం కాగా, జిడిపిలో దేశం అప్పుల నిష్పత్తి 50.4 శాతంగా ఉందని.. ఏ రకంగా చూసినా రాష్ట్రం అప్పులు ఎఫ్.ఆర్.బి.ఎం. చట్ట పరిమితుల్లోనే ఉన్నాయని స్పష్టం చేశారు.
ఈ వాస్తవాన్ని గమనించకుండా బురదజల్లడమే లక్ష్యంగా కొంతమంది రాష్ట్ర అప్పుల గురించి దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news