సీఎం కేసీఆర్‌ కుటుంబంపై సీబీఐకి కెఏ పాల్ ఫిర్యాదు..రూ.9 లక్షల కోట్ల తిన్నారు..!

-

సీఎం కేసీఆర్‌ కుటుంబంపై సీబీఐకి కెఏ పాల్ ఫిర్యాదు చేశారు. ఇవాళ ఉదయం సీబీఐ కార్యాలయంలోకి వెళ్లిన కెఏ పాల్… సీబీఐ డైరెక్టర్ సుబోద్ కుమార్ జైశ్వాల్ కు పిర్యాదు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల అవినీతి సీబీఐ కి ఫిర్యాదు చేశారు పాల్‌. 9 లక్షల కోట్ల అవినీతికి, కేసీఆర్, ఆయన కుటుంబం పాల్పడిందని.. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి అవినీతి చూడలేదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా సీఎం కేసీఆర్ అవినీతిపై విచారణ జరగాలని కోరుతున్నారు… కేసీఆర్ కుటుంబానికి ఆదాయానికి మించి ఉన్న ఆస్తులపై దర్యాప్తు జరపాలని పాల్ డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ కు 60 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉంది.. కేసీఆర్ సర్కార్ నాలుగున్నర లక్షల కోట్ల అప్పు చేసిందని ఆగ్రహించారు.

తెలంగాణ లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్, ఎమ్మెల్సీ కవిత లు పెదఫా ఎత్తున అవినీతికి పాల్పడ్డారని.. తెలంగాణ తో పాటూ సింగపూర్, దుబాయ్, అమెరికాలో అనేక ఆస్తులు కూడబెట్టారని నిప్పులు చెరిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అవినీతికి పాల్పడ్డారు… ప్రాజెక్టు అంచనా బడ్జెట్ లక్షా 5 వేల కోట్లు కాగా 35 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఆగ్రహించారు. కేసీఆర్ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకు నాపై దాడులు చేస్తున్నారు.. కేసీఆర్ అవినీతి అక్రమాలపై జరిగే దర్యాప్తుకు నా పూర్తి సహకారం అందిస్తానని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news