కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ కలిశారు. తెలంగాణలో జరుగుతున్న అవినీతి అన్యాయం అక్రమాలు నా జీవితంలో ఎన్నడూ చూడలేదని.. అమిత్ షాతో అనేక విషయాలను చర్చించానని ఈ సందర్భంగా కేఏ పాల్ పేర్కొన్నారు. కేసీఆర్ అవినీతి కేటీఆర్ అక్రమాలు కెసిఆర్ దాడులు అని.. లక్షల కోట్లు మాయమయ్యాయని ఆగ్రహంచారు.
తెలంగాణలో నా పైన జరిగిన దాడిని కేంద్రమంత్రులు అమిత్ షా, పురుషోత్తం రూపాల ఖండించారని..కేసీఆర్ నీ పని అయిపోయింది..నాకు అమిత్ షా చెప్పారని హెచ్చరించారు కేఏ పాల్. రెండో రోజుల్లో తెలంగాణకు వస్తున్న అని అమిత్ షా చెప్పారు, భరోసా ఇచ్చారని.. దేశ ఆర్థిక పరిస్థితులపై అమిత్ షా తో మాట్లాడానని వెల్లడించారు.
చైనా జీడీపీ ఇండియా జిడిపి 33 ఏళ్ల క్రితం ఒకేలా ఉండేవని, ఇప్పుడు చైనా జిడిపి ఆరు రెట్లు మన దేశం కన్నా ఎక్కువగా ఉందని… ప్రజాశాంతి పార్టీ తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్లా పోటీ చేస్తుంది, పోరాటం చేస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ డిజిపి కలుస్తాను అంటే సమయం ఇవ్వలేదు. కానీ కేంద్ర హోంమంత్రి అడగగానే సమయం ఇచ్చారని గుర్తు చేశారు. ప్రధానమంత్రి కేంద్ర మంత్రులు నాకు ఇచ్చే గౌరవాన్ని మీరు చూడొచ్చు వారందరికీ వందనాలు అని.. తెలంగాణ ప్రజలకు ఒకటే చెబుతున్నాను.కెసిఆర్ కేటీఆర్ అవినీతి చెల్లదని హెచ్చరించారు.