కేసీఆర్ గేమ్ స్టార్ట్…కాంగ్రెస్-కమలాన్ని మించేలా!

-

తెలంగాణలో రాజకీయాలు ఊహించని విధంగా నడుస్తున్నాయి…ఎప్పటికప్పుడు పార్టీలు ఒకరి పై ఒకరు పై చేయి సాధించడమే లక్ష్యంగా ముందుకెళుతున్నాయి..అసలు ఎప్పుడు ఏ పార్టీకి లీడింగ్ ఉంటుందో అర్ధం కావడం లేదు…అంతా బాగానే ఉంది..అసలు అధికార టీఆర్ఎస్ కు తిరుగులేదనుకునే లోపే సీన్ మారిపోతుంది..అనూహ్యంగా కమలం రేసులోకి వచ్చేస్తుంది..టీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీ అనేలా రాజకీయం చేస్తుంది.

సరే కాంగ్రెస్ పని అయిపోయిందనుకునే లోపే…ఆ పార్టీ సరికొత్త స్ట్రాటజీలతో ముందుకొస్తుంది.. ఊహించని విధంగా కాంగ్రెస్ కూడా రేసులోకి వస్తుంది. ఇలా ఎప్పటికప్పుడు మూడు పార్టీల మధ్య లీడింగ్ మారిపోతుంది. అయితే ఇటీవల రాహుల్ గాంధీ రావడంతో కాంగ్రెస్ కు కొత్త ఊపు వచ్చింది. రాహుల్ గాంధీ సభ తర్వాత కాంగ్రెస్ దూకుడు మీద ఉంది..ఆ పార్టీ మరింత ఎఫెక్టివ్ గా రాజకీయం చేస్తుంది..మీడియాలో కూడా కాంగ్రెస్ గురించి పెద్ద ఎత్తున చర్చలు నడుస్తూ వచ్చాయి.

ఇలా కాంగ్రెస్ టైమ్ నడుస్తుందనుకునే లోపే బీజేపీ సైతం సరికొత్తగా ముందుకొస్తుంది..ఇప్పటికే బండి సంజయ్ పాదయాత్రతో దూసుకెళుతున్నారు..ఇప్పుడు ఆ పాదయాత్ర ముగింపు సభని భారీగా నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఈ నెల 14న అమిత్ షాని తీసుకొచ్చి భారీ ఎత్తున సభ పెట్టాలని చూస్తున్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో భారీ సభ పెట్టేందుకు రెడీ అయ్యారు..ఈ సభ ద్వారా బీజేపీ సత్తా ఏంటో చూపించాలని భావిస్తున్నారు.

అయితే ఇలా ప్రతిపక్ష పార్టీలు దూకుడుగా ఉంటే అధికార టీఆర్ఎస్ సైలెంట్ గా ఉండదు కదా…సీఎం కేసీఆర్ అదిరిపోయే స్ట్రాటజీతో ముందుకొస్తున్నారు…కాంగ్రెస్, కమలం పార్టీని మించేలా భారీ సభ పెట్టి ప్రజల్లోకి వెళ్లాలని ప్లాన్ చేశారు. త్వరలో చెన్నూరు నియోజకవర్గంలో భారీ సభ పెట్టి కాంగ్రెస్, కమలం పార్టీలకు కౌంటర్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఈ సభని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు గులాబీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. మొత్తానికి తెలంగాణలో ఒకరిని మించి ఒకరు రాజకీయం చేస్తూ ముందుకెళుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news