కడియం శ్రీహరికి షాకిచ్చిన కాంగ్రెస్ అధిష్టానం !

-

బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్‌లో చేరిన స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి కాంగ్రెస్ అధిష్టానం ఊహించని షాకిచ్చింది. తాజాగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే..వరంగల్ ఎంపీ టికెట్‌ ఇస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే టికెట్ తన కూతురు కావ్యకు ఇవ్వాలని కోరగా అందుకు అధిష్టానం కూడా హామి ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో కడియం శ్రీహరినే బరిలోకి దింపాలని కాంగ్రెస్ యోచిస్తుంది.

సంస్థాగతంగా అక్కడ బీఆర్ఎస్ పార్టీకి బలం ఉండటంతో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. అదేవిధంగా ఇప్పటికే పార్టీలో చేరిన దానం నాగేందరకి కూడా కాంగ్రెస్ ఇదే షరతు పెట్టింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే.. సికింద్రాబాద్ ఎంపీ సీటును కేటాయిస్తామని చెప్పింది. అయితే, దానం నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఆ టికెట్‌ను బొంతు రామ్మోహన్‌కు ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. కాగా, దేశవ్యాప్తంగా ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు మొత్తం ఏడు దశల్లో లోక్ సభ ఎన్నికలను నిర్వహించనున్నారు. తెలంగాణలో మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ ప్రక్రియను జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news