వరంగల్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్య

-

వరంగల్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్య పేరును ప్రకటించారు మంత్రి కొండా సురేఖ. మరికాసేపట్లో కావ్య పేరును అధిష్టానం అధికారికంగా ప్రకటిస్తుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత తన తండ్రి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటుగా కావ్య కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన సంగతి తెలిసిందే.కేసీఆర్ కు తెలంగాణ ప్రజల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మంత్రి కొండా సురేఖ అన్నారు. పొలం బాట పేరుతో కేసీఆర్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం గా ఉన్నప్పుడు సెక్రటేరియట్ కు కూడా రాని కేసీఆర్ కు ఇప్పుడు రైతులు గుర్తు రావడం విడ్డురమని ఆమె వ్యంగస్త్రాలు సంధించారు

కేసిఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన పాపాలను కాంగ్రెస్ ప్రభుత్వం కడుగుతుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. రేవంత్ రెడ్డి మీద మంచి మర్యాద లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ లో కేటీఆర్ త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమని వార్నింగ్ ఇచ్చారు . ఈ కేసులో కేసీఆర్ జైలుకు వెళ్లిన ఆశ్చర్యపోనవసరం లేదని ఆమె అన్నారు. జైలుకు పోవడానికి ముందే రేవంత్ రెడ్డిని తిట్టాలని కేటీఆర్ చూస్తున్నాడని కొండా సురేఖ విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news