ఎస్వీఆర్‌ సమకాలీనుడు కైకాల మాత్రమే..

-

ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు.. ఆయన శారీరకంగా దూరమైన అతని పాత్రలు మాత్రం అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి.. అతని నటన, గంభీరమైన మాటలతో అబ్బురపరిచే హావభావాలు పలికిస్తూ ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ గుర్తుండితారు నటుడు సత్యనారాయణ.. అలనాటి నటుడు ఎస్ వి ఆర్ తర్వాత అంతటి స్థాయిలో నటన చాతుర్యాన్ని కనబరిచిన ఏకైక నటుడు సత్యనారాయణ అని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు..

తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో చెరగని ముద్రవేసిన నటుడు ఎస్ పి ఆర్.. ఎస్వీ రంగారావు అనంతరం అతని స్థానాన్ని భర్తీ చేసిన ఏకైక నటుడు సత్యనారాయణ అని ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు గుర్తు చేసుకుంటూ ఉంటారు.. ఎన్నో పౌరాణిక, చారిత్రాత్మక, సాంఘిక చిత్రాల్లో నటించిన సత్యనారాయణ తనదైన నటనతో మెప్పించి దాదాపు 750 కి పైగా సినిమాల్లో నటించారు.. అలాగే ఎస్వీ రంగారావు మరణం అతని స్థానాన్ని భర్తీ చేయడానికి దర్శక, నిర్మాతలు సత్యనారాయణ ను ఎంచుకున్నారు.. వారి నమ్మకాన్ని నిలబెడుతూ అన్ని రకాల పాత్రలని పోషిస్తూ వచ్చారు ఈయన.. అలాగే మొదటి తరం నటీనటులు ఎన్టీఆర్ ఏఎన్నార్ తో నటించిన సత్యనారాయణ.. నిన్నటి తరం కథానాయకులు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునతో సైతం నటించారు.. వీరందరితో ముఖ్యంగా ప్రతినాయకుడి పాత్రల్లో ఎక్కువగా కనిపించారు. అలాగే ఈ తరం కథానాయకులతో కూడా నటించిన సత్యనారాయణ తండ్రిగా, తాతగా తనదైన పాత్రల్లో మెప్పించారు..

Read more RELATED
Recommended to you

Latest news