సంచ‌ల‌నంః నోరు విప్పిన క‌ల్కి

-

కల్కి ఆశ్రమ వ్యవస్థాపకులైన విజయ్ కుమార్ నాయుడు, పద్మావతి నాయుడు అజ్ఞాతం వీడారు. తమిళనాడులోని నేమమ్ ఆశ్రమంలోనే వారు ఉన్నట్లు కల్కీ ఆశ్రమం మీడియాకు ఓ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో తమ ఆరోగ్యం బావుందని, తమ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కల్కి దంపతులు పేర్కొన్నారు.

‘కల్కి’ ఆశ్రమంపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తోన్న నేపథ్యంలో ఆ ఆశ్రమ వ్యవస్థాపకులు విజయ్ కుమార్ నాయుడు, పద్మావతి నాయుడు కనపడకుండా పోయిన విషయం తెలిసిందే. వారిద్దరు తమిళనాడులోని నేమమ్ ఆశ్రమంలో ఉన్నారంటూ కల్కీ ఆశ్రమం ఓ ప్రకటన చేసింది. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో విజయ్ కుమార్ దంపతులు మాట్లాడుతూ.. తమ ఆరోగ్యం బాగుందని, తమ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.

దేశం విడిచి పారిపోయామంటూ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని వారు చెప్పుకొచ్చారు. అలాగే, తమ ఆశ్రమాల ప్రధాన కార్యాలయాల్లో ఎప్పటిలాగే అన్ని కార్యక్రమాలు కొనసాగుతున్నాయని విజయ్ కుమార్ దంపతులు అన్నారు. కాగా, ఇటీవల కల్కి ఆస్తులపై ఆదాయపన్ను శాఖ చేసిన దాడుల్లో గుట్టలుగా నోట్ల కట్టలు, బంగారం లభ్యం కావడం అందరినీ విస్మయానికి గురిచేసింది. నిత్యం వివాదాలకు కేంద్రంగా మారిన కల్కి ఆశ్రమంలో జరిగిన ఐటీ సోదాల్లో లక్షల కోట్ల రూపాయల ఆస్తులు వెలుగుచూసినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news