Kalki movie : లీకు వీరులకు వైజయంతి మూవీస్ వార్నింగ్

-

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం కల్కి 2898 ఏడీ .ఈ సైన్స్ ఫిక్షన్ అండ్ యాక్షన్ మూవీపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ రేంజ్ లో తెరెకెక్కుతున్న ఈ సినిమా కోసం ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

దీంతో ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ ఐనా క్షణాల్లో వైరల్ అవుతోంది.భారీ బడ్జెట్తో ‘కల్కి’ సినిమాను తెరకెక్కిస్తుండటంతో లీకు వీరులకు వైజయంతి మూవీస్ వార్నింగ్ ఇచ్చింది. సినిమాకు సంబంధించిన కంటెంట్ను షేర్ / లీక్ చేయడం కాపీరైట్ ఉల్లంఘన అవుతుందని వెల్లడించింది. సినిమాలోని సీన్స్, ఫొటోలు, ఫుటేజీ ఎవరూ షేర్ చేయొద్దని హెచ్చరించింది. అతిక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ప్రకటన విడుదల చేసింది. ఈరోజు సాయంత్రం 7 గంటలకు కల్కి ట్రైలర్ రిలీజ్ కానుంది.కాగా ఈ చిత్రం లో అమితాబ్‌, కమల్‌హాసన్‌, దీపిక పదుకొణే, దిశా పటానీ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుదల అయిన పోస్ట‌ర్స్, గ్లింప్స్‌ల‌కు మంచి స్పందన వ‌చ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news