విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. రెండు సార్లు ఎంపీగా గెలిపించిన విజయవాడ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. రెండు సార్లు టీడీపీ ఎంపీగా గెలిచిన కేశినేని నాని.. ఇటీవలే వైసీపీ నుంచి పోటీ చేసి తన సొంత తమ్ముడి చేతిలో ఓడిపోయారు. 2014, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు.
K
ఇక తాజాగా ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలుగుతున్నానని తెలిపారు. తనకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ అభివృద్ధికి సహకరిస్తానని తెలిపారు. విజయవాడ ప్రజలు తనకు స్పూర్తి అన్నారు. కొత్తగా గెలిచిన వారు విజయవాడ అభివృద్ధికి సహకరించాలని కోరారు. విజయవాడలో తాను గెలుస్తాననే ధీమాలో ఉన్నారు. కానీ తన సోదరుడు కేశినేని చిన్ని టీడీపీ అభ్యర్థి విజయం సాధించాడు. 2023 చివరిలో టీడీపీ నుంచి వైసీపీలో చేరారు కేశినేని నాని. అంతకు ముందే నాని, చిన్నికి మధ్య వివాదం తలెత్తింది.