ఇవాళ తెలంగాణ పర్యటించిన అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ… కేసీఆర్ ప్రవేశ్ పెట్టిన పథకాలపై కామెంట్ చేశారు. అయితే…. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ కామెంట్స్ పై ట్విట్టర్లో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ గొప్ప సంస్కృతి సంప్రదాయాలను తుడిచిపెట్టడానికి బిజెపి ఇంతగా ఎందుకు ప్రయత్నిస్తుందో అర్థం అవడం లేదని… 2018 ఎన్నికల్లో ఇలాగే విర్రవీగుతూ మాట్లాడిన మీ పార్టీ నేతలకు తెలంగాణ ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టి, 107 స్థానాల్లో డిపాజిట్ లేకుండా చేశారని చురకలు అంటించారు.
2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి ఇప్పటికీ ఎనిమిది ఏళ్ళు కావస్తోంది మీరు సృష్టించిన 16 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ?? అని నిలదీశారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) సంస్థ ప్రకారం, భారత్‌లో నిరుద్యోగిత రేటు డిసెంబర్‌లో దాదాపు 8 శాతానికి పెరిగింది…బంగ్లాదేశ్ (5.3 %), మెక్సికో (4.7 %), వియత్నాం (2.3 %) లాంటి అభివృద్ధి చెందుతోన్న దేశాల కంటే కూడా భారత్‌లో ఈ నిరుద్యోగం రేటు అధికంగా ఉందని… ఎద్దేవా చేశారు.
కెసిఆర్ పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టుకుంటూ , తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు మాత్రము దానికి పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడడం మీ విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. మరోసారి తెలంగాణ కు వచ్చినప్పుడు సరైన హోం వర్క్ చేసుకొని రావాల్సిందిగా కోరుతున్నానని ఓ రేంజ్ సెటైర్ వేశారు కల్వకుంట్ల కవిత.