AmigosTeaser : కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ టీజర్.. దుమ్ములేసిపోయిందిగా

-

కొన్ని ఏళ్లుగా సరైన సక్సెస్ లేని కళ్యాణ్రామ్ గతేడాది కొత్త దర్శకుడు మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో చేసిన బింబిసారా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత కళ్యాణ్రామ్ ‘అమీగోస్’ మూవీతో పలకరించనున్నారు.

కళ్యాణ్ రామ్ కు సంబంధించిన సిద్ధార్థ మంజునాథ్ గ్యాంగ్ స్టార్ పాత్రలకు సంబంధించిన లుక్స్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల ఈ మూవీ నుంచి మూడు పాత్రలను కలిపి సరికొత్త పోస్టర్ను విడుదల చేశారు.

ఈ చిత్రం ఫిబ్రవరి 10, 2023న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని మేకర్స్ ప్రకటించారు. ఈ రీసెంట్ యాక్షన్ త్రిల్లర్ లో కన్నడ నటి ఆషిక రంగనాథ్ నటిస్తోంది. అయితే, తాజాగా ఈ సినిమా టీజర్‌ ను చిత్ర బృందం వదలింది. ఈ టీజర్‌ లో కళ్యాణ్‌ పాత్రలు చాలా అద్భుతంగా ఉన్నాయి. సినిమాపై ఈ టీజర్‌ అమాంతం అంచనాలను పెంచేసింది.

Read more RELATED
Recommended to you

Latest news