కళ్యాణ్ రామ్ అలా అని ఊహించలేదంటున్న.. సంయుక్త మేనన్..!!

-

సంయుక్తమేనన్.. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా హీరోలుగా మల్టీ స్టార్లర్ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే . ఇక ఈ సినిమాలో దగ్గుబాటి రానాకు భార్య పాత్రలో సంయుక్తా మేనన్ నటించి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. తన నటనతో ఎమోషన్ సీన్స్ లో బాగా నటించి ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించిన ఈ ముద్దుగుమ్మకు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న బింబిసారా సినిమాలో హీరోయిన్గా అవకాశాన్ని పట్టేసింది. ఇకపోతే ఆగస్టు 5వ తేదీన చాలా ఘనంగా విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి చిత్రం యూనిట్ ప్రమోషన్స్ శరవేగంగా జరుపుతున్నారు. ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగానే సంయుక్త మేనన్ తాజాగా ఒక ప్రెస్ మీట్ లో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

ఆమె మాట్లాడుతూ పవర్ స్టార్ సినిమాతో నటించే అవకాశం రావడం నా సినీ కెరియర్ కు ప్లస్ అయిందని ఆమె తెలిపింది. ఇక కెరియర్ ఆరంభంలోనే పవన్ కళ్యాణ్, కళ్యాణ్ రామ్ , సాయి ధరంతేజ్ లాంటి పెద్ద హీరోలతో నటించే అవకాశం రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను అని సంయుక్తమేనన్ వెల్లడించింది. కళ్యాణ్ రామ్ గురించి మాట్లాడుతూ కళ్ళతోనే భావాలు పలికిస్తారు అని బింబిసార సినిమా షూటింగ్ కోసం వెళ్ళిన మొదటి రోజే రాజు గెటప్ లో ఆయన కనిపించారని , ఒక సీన్లో ఆయన చూపును చూస్తే నిజంగా రాజు లాగే కనిపించాడని.. నిజంగా రాజు గారే వచ్చారా అన్న ఫీలింగ్ తనకు కలిగింది అని ఆమె తెలిపింది.

ఒక భిన్నమైన బాడీ లాంగ్వేజ్ అని , మొదటి రోజు తన వద్దకు వచ్చి మీరు మా ప్రాజెక్టులో భావం కావడం గర్వంగా భావిస్తున్నామని చెప్పడంతో తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని ఆమె తెలిపింది. ఇక అంతే కాదు కళ్యాణ్ రామ్ మంచితనానికి నిదర్శనం అని చెబుతూ తన ఫీలింగ్స్ ను బయటపెట్టింది సంయుక్తమేనన్.. ఇలా నందమూరి హీరో గురించి ఈమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news