రాజకీయ ప్రవేశం పై క్లారిటీ ఇచ్చిన కళ్యాణ్ రామ్..!!

-

స్వర్గీయ నందమూరి హరికృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కళ్యాణ్ రామ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈయన తాజాగా నటించినా బింబిసారా సినిమా ఆగస్టు 5వ తేదీన విడుదలవుతున్న నేపథ్యంలో హైదరాబాదులో నిన్న సాయంత్రం శిల్పకళా వేదికలో ఘనంగా ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఇకపోతే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించడమే కాకుండా తన అన్నకు సంబంధించిన అన్ని విషయాలను కూడా వెల్లడించారు.

ఇక ఈయన స్పీచ్ ముగిసిన తర్వాత కళ్యాణ్ రామ్ కూడా తన పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇవ్వడం జరిగింది. గతంలో తమ తాతగారు ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ తరఫున నందమూరి హీరోలు చాలా బిజీగానే కనిపించారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ కోసం ఎన్నో ప్రచారాలు కూడా చేశారు. కానీ కొన్ని రాజకీయాల కారణంగా కొంతకాలం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ ఇద్దరూ కూడా పార్టీకి దూరంగా ఉంటూ తమ సినీ కెరియర్ పై దృష్టి పెట్టారు. అంతేకాదు ఇటీవల ఎన్నికలపై ఏ విధమైన వివరణ కూడా వీరు ఇచ్చింది లేదు. ఇకపోతే నందమూరి హీరోలలో తెలుగుదేశం పార్టీ నాయకుల నాయకత్వం పై అసంతృప్తిగానే ఉన్నట్లు ఎన్నో కథనాలు వెలువడుతున్నాయి.

ఇక ఈ క్రమంలోని పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చారు కళ్యాణ్ రామ్. తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అనే ప్రశ్న ఎదురవగా కళ్యాణ్ రామ్ ఆలోచిస్తూ ప్రస్తుతం అటువైపుగా ఆలోచన ఏమాత్రం లేదు.. ప్రస్తుతం నేను యాక్టింగ్ లోనే ఉన్నాను ఒకేసారి రెండు పడవల మీద ప్రయాణం చేయకూడదు కదా.. ఇక నాకైతే అలాంటి రెండు విభిన్నమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళే ఆసక్తి కూడా లేదు అంటూ తెలిపాడు. అవసరం అనుకున్నప్పుడు మాత్రమే రాజకీయ రంగ ప్రవేశం చేస్తాను అని తెలిపాడు. అసలు అవసరం వస్తుందా లేదా తెలియదు కానీ భవిష్యత్తులో అక్కడి వరకు వెళ్తానో లేదా అనేది కూడా ప్రశ్నార్ధకంగా మారిపోయింది అంటూ కళ్యాణ్ రామ్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news