కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ మూవీ వాయిదా.. ఎందుకంటే..?

-

‘బింబిసార’తో ఘన విజయాన్ని అందుకున్నారు నందమూరి కళ్యాణ్ రామ్. సోషియో ఫాంటసీ జోనర్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకోవ‌డమే కాకుండా కళ్యాణ్ రామ్‌కు హిట్టు లేని లోటును తీర్చింది. అయితే కళ్యాణ్ రామ్ తర్వాత చేసిన అమిగోస్ సినిమా మాత్రం నిరాశ పరిచింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ‘డెవిల్’ గా థియేటర్లలో సందడి చేయనున్నారు కళ్యాణ్ రామ్‌. కళ్యాణ్ రామ్ హీరోగా అభిషేక్‌ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. సంయుక్త మేనన్‌ కథానాయిక.

అయితే ఇప్పుడీ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ సినిమాని మొద‌ట నవంబరు 24న విడుదల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్రకటించిన విష‌యం తెలిసిందే. అయితే డెవిల్ ఆ డేట్‌కి రావడం లేదు. దీనికి కారణం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తికాకపోవడమే. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన రణ్‌బీర్ కపూర్ యానిమల్ సినిమాతో బిజీగా వున్నారు. డెవిల్ సెకండ్ హాఫ్ ఆర్ఆర్ ఇంకా పూర్తి చేయాల్సివుంది. అలాగే కొంత సిజీ వర్క్ కూడా పెండింగ్‌లో వుంది. నవంబర్ 24లోగా పెండింగ్ పనులు పూర్తి కావడం కష్టమే,. అందుకే సినిమాని వాయిదా చేస్తునట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. త్వరలోనే కొత్త డేట్‌ని అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

Read more RELATED
Recommended to you

Latest news