ఎలక్షన్లు వస్తుంటాయి.. పోతుంటాయి.. ఎవ్వడూ వద్దన్న ఎవ్వడు కాదన్నా నవంబర్ 30న ఎన్నికలు జరుగుతాయి. సత్తుపల్లిలో 70 నుంచి 80వేల మేజార్టీతో సండ్ర వెంకటవీరయ్య గెలవడం ఖాయం అన్నారు. ఎమ్మెల్యేల వెనుక ఏ పార్టీ ఉన్నది.. ఆ పార్టీ వైఖరీ ఏంది..? ప్రజల గురించి ఆ పార్టీ ఏం ఆలోచిస్తుందనేది చూసి ఓటు వేయాలని సూచించారు కేసీఆర్. ఎన్నికల్లో వ్యక్తులు, కార్యదక్షతను చూడాలి అన్నారు. ఓటు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు కేసీఆర్.
దళిత బంధు పెట్టిన నాడు ఎవ్వడూ అడగలేదు. దళితులు వివక్షతకు గురయ్యారు. జాషువా లాంటి మహాకవి దళితుల గురించి వ్యాసాలు రాశారు. తరతరాలుగా దళితుల పరిస్థితి బాలేదు. దశాబ్దాలుగా దలితులను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు. నేటికి దలితులపై ఉత్తర భారతదేశంలో దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నికల్లో మ్యానిఫెస్టో లో పెట్టనివి చాలా అమలు చేశామని చెప్పారు. తెలంగాణను నూటికి నూరు శాతం బాగుచేయాలనే ఉద్దేశంతో పనులు చేపడుతున్నాం.