వావ్‌.. పొన్నియన్‌ సెల్వన్‌ ఆడియో లాంచ్‌ ఈవెంట్‌కు విశ్వనటుడు

-

స్టార్ డైరెక్టర్ మ‌ణిర‌త్నం ఆవిష్కరిస్తోన్న విజువ‌ల్ వండ‌ర్ ‘పొన్నియిన్ సెల్వన్ 2’. లైకా ప్రొడ‌క్షన్స్‌, మ‌ద్రాస్ టాకీస్ బ్యాన‌ర్స్‌పై సుభాస్కర‌న్‌, మ‌ణిర‌త్నం ఈ మూవీని నిర్మిస్తున్నారు. తమిళంలో చారిత్రక నేపథ్యంలో వచ్చిన భారీ బడ్జెట్ చిత్రాలలో ‘పొన్నియిన్ సెల్వన్’ ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకి మణిరత్నం దర్శకత్వం వహించడమే కాదు .. లైకా ప్రొడక్షన్స్ వారితో కలిసి ఈ సినిమాను నిర్మించారు. చోళ – పాండ్యరాజుల మధ్య సాగే ప్రతీకార వ్యూహాలే ఈ సినిమా. క్రితం ఏడాది సెప్టెంబర్ 30వ తేదీన విడుదలైన ఈ సినిమా, తన భారీతనాన్ని చాటుకుంది. వసూళ్ల విషయంలో తమిళనాట కొత్త రికార్డులను క్రియేట్ చేసింది.

Ponniyin Selvan: Kamal Haasan also wanted to make Aishwarya Rai starrer but  with THIS actor | Celebrities News – India TV

అలాంటి సినిమాకి సీక్వెల్ గా రూపొందిన ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ఏప్రిల్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆడియో లాంచ్ .. ట్రైలర్ లాంచ్ ఈవెంటును ఈ నెల 29వ తేదీన చెన్నైలో నిర్వహించనున్నారు. అక్కడి నెహ్రూ ఇండోర్ స్టేడియం ఇందుకు వేదికగా మారనుంది. గ్రాండ్ గా జరగనున్న ఈవెంటుకి కమల్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నాడు. ఆ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది.

Read more RELATED
Recommended to you

Latest news