దుబ్బాక ఉప ఎన్నికల ప్రచార గడువు కొద్ది సేపటి క్రితం ముగిసింది. ఈ సందర్భంగా సిద్ధిపేట సీపీ జోయల్ డేవిస్ మాట్లాడుతూ సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు ఉన్నాయని, ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు జిల్లా విడిచిపెట్టి వెళ్లిపోవాలని పేర్కొన్నారు. ఈవీఎంల తరలింపుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామమన్న ఆయన ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని అన్నారు.
స్ట్రాంగ్ రూమ్ ల దగ్గర నిరంతర గస్తీ కొనసాగుతుందని ఆయన అన్నారు. మండలానికి ఒక ఏసీపీ స్థాయి అధికారి పని చేస్తున్నారని ఆయన అన్నారు. ఇక నోట్ల కట్టల వరద కూడా మొదలయింది. దుబ్బాక ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత బయటపడ్డ నోట్ల కట్టల వివరాలు ఇలా ఉన్నాయి. మహాంకాళీ పీఎస్ పరిధిలో రూ.16.69 లక్షలు, నారాయణగూడ పీఎస్ పరిధిలో రూ.14.90 లక్షలు, సుల్తాన్‌బజార్ పీఎస్ పరిధిలో రూ.31.26 లక్షలు, సైఫాబాద్‌లో రూ. 50లక్షలు, ఆఫ్జల్‌గంజ్‌లో రూ.21.56 లక్షలు, బేగంపేటలో రూ.కోటి, వెస్ట్‌జోన్ పరిధిలో రూ.48లక్షలు, శామీర్‌పేటలో రూ.48లక్షలు, నార్సింగ్‌లో రూ.12లక్షలు, భూంపల్లిలో రూ.9లక్షల, సిద్దిపేటలో రూ.18 లక్షలు పట్టారు పోలీసులు.