హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించిన కామారెడ్డి మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు

-

కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. మాస్టర్ ప్లాన్ వివాదంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు, మంత్రి కేటీఆర్ స్పందించారు. ఎవరికీ అన్యాయం జరగకుండా మాస్టర్ ప్లాన్‌ను మారుస్తామని హామీ కూడా ఇచ్చారు. కానీ రైతలు నాయకులను నమ్మడం లేదు. ఇందులో భాగంగానే బాధిత రైతులంతా హైకోర్టును కూడా ఆశ్రయించారు.

అయితే తాజాగా కామారెడ్డి మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు రాష్ట్ర హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించారు. కామారెడ్డి కలెక్టర్, పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మాస్టర్ ప్లాన్ వ్యతిరేక నిరసనల్లో లాఠీఛార్జ్ చేశారని ఫిర్యాదు చేశారు. రైతులు తమ హక్కుల కోసం పోరాడుతుంటే ఈ ప్రభుత్వం లాఠీతో అణిచివేయాలని ప్రయత్నించిందని ఆరోపించారు. తమకు పోలీసులు, కోర్టుల్లో న్యాయం జరిగేలా లేదని.. అందుకే హెచ్‌ఆర్సీని ఆశ్రయించినట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news