విజయవాడలో వెలసియున్న కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకోవడానికి దేశంలోని నలుమూలల నుండి భక్తులు తరలివస్తుంటారు. దీనితో ఈ గుడి యొక్క ప్రాముఖ్యత రోజు రోజుకు పెరుగుతూ పోతోంది. కాగా ఇటీవల గుడిలో జరిగిన చీరాల దొంగతనం పట్ల గుడి ఈవో సీరియస్ గా ఉన్న విషయం తెలిసిందే. కాగా తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ చీరలను గోల్ మాల్ చేసిన వ్యవహారంలో సంబంధం ఉందని నమ్ముతున్న ఇద్దరు ఉద్యోగులకు ఈవో భ్రమరాంబ నోటీసులు జారీ చేశారు. ఇందులో జూనియర్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం రూ. కోటి 66 లక్షలు మరియు రెకార్డ్ అసిస్టెంట్ రమేష్ రూ. 20 లక్షలు చెల్లించాలని ఈ నోటీసులో పేర్కొన్నారు. ఈవో ఆదేశాల ప్రకారం కేవలం పది రోజుల్లో థేశ్వస్థానానికి ఈ డబ్బును కట్టకపోతే వారిపై కారణమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మరి ఇటువంటి సమయంలో ఈ ఇద్దరు ఎటువంటి నిర్ణయం తీసుకోనున్నారు, ఈవో మేడం చెప్పినట్లు అమౌంట్ కట్టేస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.