ఆ నియోజకవర్గంలో కారుకు రెండు స్టీరింగులు.. ఎమ్మెల్యే వర్సెస్ మాజీ మంత్రి..?

-

అధికార టీఆర్ఎస్ పార్టీలో విభేదాలు బయటపడుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ మంత్రికి మధ్య విభేదాలు రోజురోజుకూ ఎక్కువవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంతకీ అసలేం జరుగుతుంది? అది ఏ నియోజకవర్గం? అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ కథనాన్ని పూర్తిగా చదవాల్సిందే.


ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో ముందస్తు అసెంబ్లీ ఎలక్షన్స్‌లో అధికార టీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన కందాళ ఉపేందర్‌రెడ్డి గెలుపొందారు. అయితే, ఆ తర్వాత క్రమంలో మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కందాళ గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. దాంతో ప్రత్యర్థి కందాళ పింక్ పార్టీలోనే వచ్చారు.

ఇక కందాళ వర్గీయులు, తుమ్మల వర్గీయుల మధ్య పోరు మొదటి నుంచి ఉండిపోయింది అలానే. ఈ క్రమంలోనే తమపై ఎమ్మెల్యే కక్ష గట్టినట్లు, వారిపైన అక్రమ కేసులు పెడుతున్నట్లుగా మాజీ మంత్రి అనుచరులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే తమకు రక్షణ కల్పించాలని కోరుతూ తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఈ విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఎమ్మెల్యే ప్రోద్బలంతో పోలీసులు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పాలేరు నియోజకవర్గ టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఈ విషయమై అవసరమైతే మంత్రి కేటీఆర్‌కూ కంప్లయింట్ చేస్తామని తుమ్మల అనుచరులు పేర్కొంటున్నారు. ఎమ్మెల్యే కందాళ అసలు టీఆర్ఎస్ నాయకులకు గౌరవమివ్వడం లేదని వివరిస్తున్నారు. అయితే, ఈ విషయాల్లో సీఎం కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ అని ఇటీవల కాలంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పేర్కొన్న సంగతి అందరికీ తెలిసిందే. అధికార పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనుచరుల మధ్య ఉన్న విభేదాలు ఎంత వరకు దారితీస్తాయో చూడాలి మరి..

Read more RELATED
Recommended to you

Latest news