‘ ఇందిరాగాంధీ’ గా కంగనా రనౌత్.. ఫస్ట్ లుక్ రిలీజ్

-

థాకడ్ సినిమాతో గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కంగనారనౌత్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ చిత్రం తర్వాత ఎమర్జెన్సీ పేరుతో కంగనారనౌత్ ఓ సినిమా చేయబోతోంది. ఇందులో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో కంగనా రనౌత్ కనిపించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. టీజర్లో కంగనారనౌత్ ఇందిరాగాంధీ రూపాన్ని, హావభావాలు, భాషను విజయవంతంగా అనుకరించింది.

1977లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ గురించే సినిమా ఉంటుందని, అందులో తను ఆమె పాత్రను పోషిస్తున్నట్లు కంగనారనౌత్ ప్రకటించింది. సొంత నిర్మాణ సంస్థ మణికర్ణికా ఫిలింస్ బ్యానర్ లోనే ఈ చిత్రం నిర్మిస్తున్నారు అని తెలిపింది. పొలిటికల్ పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఎమర్జెన్సీకి దారితీసిన పరిస్థితులు, రాజకీయ కుట్రలు, దేశం ఎదుర్కొన్న సంక్షోభం వంటివి చూపించనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news