కళ్ళు చెదిరే ఆస్తులతో ఆశ్చర్యపరుస్తున్న కంగానా రనౌత్..!

-

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనారనౌథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె బాలీవుడ్ సినిమాలతో భారీ పాపులారిటీని దక్కించుకొని తన డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు, తమిళ్ ప్రేక్షకులకి కూడా బాగా సుపరిచితురాలుగా మారిపోయింది. ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో బయోపిక్ లు తీస్తూ మరింత పాపులారిటీ దక్కించుకున్న కంగనా రనౌత్ 500 రూపాయలతో ఇంటి నుండి పారిపోయి ఇండస్ట్రీలోకి వచ్చిన విషయం తెలిసిందే. నిజానికి ఆమె ఒక రాజ కుటుంబానికి చెందిన వారసురాలు.. అయితే నటన మీద ఆసక్తితో రాజవైభోగాలను కూడా వదిలి కేవలం 500 రూపాయలతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అలా వచ్చిన ఈమె కష్టపడి స్వశక్తితో ప్రస్తుతం కొన్ని వందల కోట్లు కూడబెట్టినట్లు సమాచారం.

మరి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కంగనా ఆస్తుల విలువ ఎంత అనేది ఇప్పుడు చూద్దాం. ఇండస్ట్రీలోకి రావడంతోనే తన నటనతో పద్మశ్రీ అవార్డును సొంతం చేసుకున్న ఈమె అసలు పేరు కంగనా అమర్దీప్ రనౌత్.. రచయితగా, డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న కంగన యాక్ట్రెస్ గా మరింత పాపులారిటీ దక్కించుకుంది. 1983 మార్చి 23న హిమాచల్ ప్రదేశ్ లోని బాంబ్లాలో జన్మించింది. 12త్ స్టాండర్డ్ వరకూ చదువుకున్న కంగనా రనౌత్ నటన మీద ఆసక్తితో 2006లో గ్యాంగ్ స్టర్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈ సినిమాలో సిమ్రాన్ హీరోయిన్గా నటించింది . ఈ సినిమా ద్వారా బెస్ట్ డెబ్యు ఫిమేల్ యాక్ట్రెస్ అవార్డును సొంతం చేసుకుంది.

తెలుగులో 2009లో ఏక్ నిరంజన్ సినిమాలో కూడా నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయింది. ఇప్పటివరకు 35 సినిమాలకు పైగా నటించినట్లు సమాచారం. ప్రస్తుతం ముంబైలో సుమారుగా రూ. 40 కోట్లకు పైగా విలువ చేసే అద్భుతమైన భవనంలో ఈమె నివసిస్తోంది.. హిమాచల్ ప్రదేశ్ లో కూడా అత్యంత ఖరీదైన ఇంటిని కలిగి ఉంది. దీని విలువ రూ.30 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. కార్ల విషయానికి వస్తే.. ఆడి Q3, మెర్సిడెస్ జి ఎల్ ఈ 350 D , బీఎండబ్ల్యూ 7:30 ఎల్.డి, వీటి విలువ సుమారుగా రూ.5 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. మరొక పక్క ఒక్కో సినిమాకు 16 కోట్ల రూపాయల పారితోషకం తీసుకుంటారు. ప్రస్తుతం ఈమె దగ్గర రూ.120 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news