నా లవ్​లైఫ్ కంటే ఎలాన్ మస్క్ ట్వీట్ ఇంట్రెస్టింగ్​గా ఉంది : కంగనా రనౌత్

-

ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ ఓ ప్రేమ వ్యవహారాన్ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. దీనికి బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం కంగన చేసిన ట్వీట్ నెట్టింట వైరల్​గా మారింది.

‘‘’ప్రభుత్వాన్ని కూల్చకుండా అడ్డుకునేందుకు సీఏఐ పంపిన నకిలీ వ్యక్తి అని తెలిసినా.. వారితో ప్రేమలో పడటం విభిన్నమైన అనుభూతి’’’ అంటూ ఎలాన్‌ మస్క్‌ ఓ పోస్ట్‌ పెట్టారు. దీనిని చూసిన నెటిజన్లు.. తన ప్రేమ గురించే ఆయన మాట్లాడుతున్నారని అనుకున్నారు. ఈక్రమంలోనే కంగన ఆయన ట్వీట్‌పై కామెంట్‌ చేశారు. ‘‘’నాకంటే నాటకీయమైన జీవితం ఎవరికీ ఉండదు. ఓ ప్రేమ వ్యవహారంలో మొత్తం సినిమా మాఫియా నన్ను జైలుకి పంపించడానికి ప్రయత్నించిన దానికంటే మస్క్‌ పెట్టిన ట్వీట్‌ కాస్త ఆసక్తికరంగా ఉంది’’’ అని ఆమె వ్యాఖ్యలు చేశారు.

కంగన గతంలో బాలీవుడ్‌ నటుడు హృతిక్‌తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారు. ఈ క్రమంలోనే హృతిక్‌పై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. వీళ్లిద్దరి మధ్య నెలకొన్న వివాదం కోర్టు వరకూ వెళ్లింది. ప్రస్తుతం ఆమె పెట్టిన ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారడంలో పలువురు నెటిజన్లు.. ఆమె లవ్‌స్టోరీ గురించే మాట్లాడుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news