పోడియం దగ్గరికి వస్తే ఆటోమెటిక్‌ సస్పెన్షన్‌ – స్పీకర్‌ తమ్మినేని సీతారం

-

పోడియం దగ్గరికి వస్తే ఆటోమెటిక్‌ సస్పెన్షన్‌ అని స్పీకర్‌ తమ్మినేని సీతారం పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ వాళ్లకు కూడా చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఇక ఇవాళ కూడా అసెంబ్లీ నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు.

ఘర్షణ అనంతరం ప్రారంభమైన అసెంబ్లీలో బెందాళం అశోక్, అచ్చం నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప, గద్దె రామ్మోహన్, వెలగపూడి రామకృష్ణ, మంతెన రామరాజు, గొట్టిపాటి రవి, ఏలూరి సాంబశివరావు, డోల బాల వీరాంజనేయ స్వాములను స్పీకర్ సభ నుంచి ఒక్కరోజు పాటు సస్పెండ్ చేశారు.

అయితే, దీనిపై స్పీకర్‌ తమ్మినేని సీతారం స్పందించారు. టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్‌ రూలింగ్‌ చేశారు. పోడియం దగ్గరికి వస్తే ఆటోమెటిక్‌ సస్పెన్షన్ అని స్పీకర్‌ తమ్మినేని సీతారం పేర్కొన్నారు. టీడీపీ సభ్యులపై స్పీకర్‌ సీరియస్‌.. నేను గౌతమబుద్ధుడిని కాను.. టీడీపీ సభ్యుల తీరు అత్యంత అవమానకరం అన్నారు స్పీకర్‌ తమ్మినేని.

Read more RELATED
Recommended to you

Latest news