Kannada Actors: జీవితంలో ఏ క్షణంలో ఏం జరుగుతుంతో ఎవరికీ తెలియదు. ఎంత డబ్బు, హోదా, పలుకుబడి చావును మాత్రం ఆపలేవు. ఎవరికీ ? ఎప్పుడు? ఎలా? సంభవిస్తుందో చెప్పలేం. మన దరికి వస్తే.. దాని నుంచి తప్పించుకోలేం. చిన్నతనంలోనే ఆకస్మికంగా మరణిస్తే.. ఆ బాధ వర్ణనాతీతం. శాండల్ వుడ్ లో చిన్న వయస్సులో చనిపోయినా తారాలకు గురించి తెలుసుకుందాం…
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్(46) 2021 అక్టోబర్ 29న గుండె పోటుతో మృతి చెందారు. రాజ్‌కుమార్ హఠాన్మరణానికి కేవలం శాండిల్ వుడ్ నే కాకుండా ..యావాత్తు సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.
2009లో.. కన్నడ మెగాస్టార్ విష్ణు వర్థన్ 58 ఏళ్ల వయసులో ఆకస్మత్తుగా గుండెపోటుతో మరణించాడు.
ఆయన దాదాపు 200 సినిమాలకు పైగా నటించారు. తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. శాండీల్ వుడ్ లో రాజ్ కుమార్ తర్వాత అంతటి మార్కెట్ సొంతం చేసుకున్నారు.
కన్నడ చిత్ర పరిశ్రమలోని ప్రతిభావంతులైన నటులలో ఒకరు శంకర్ నాగ్. కన్నడలో సూపర్ స్టార్‌గా చక్రం తిప్పుతూ.. ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తూ నెంబర్ వన్ యాక్షన్ హీరోగా ఉన్న సమయంలో షూటింగ్ నిమిత్తం జరిగిన కారు ప్రమాదంలో మరణించారు శంకర్ నాగ్( 35) 1990లో కన్నుమూసారు ఆయన చనిపోయే సమయానికి కన్నడలో స్టార్ హీరో. వరుస విజయాలతో చేతిలో దాదాపు 10 సినిమాలు ఉన్నాయి. దాదాపు 4 సంవత్సరాల వరకు విడుదల అవుతూనే ఉన్నాయంటే అతడి స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో ల్లో ఒక చిరంజీవి సర్జా. కెరీర్ పీక్స్ ఉన్న సమయంలో 39 వయస్సులో 2020 జూన్ 7న గుండె పోటుతో మరణించారు. ఆయన మరణించే సమయానికి అతని చేతిలో రెండు కంటే ఎక్కువ ప్రాజెక్టులు ఉన్నాయి. చిరంజీవి యాక్షన్ కింగ్ అర్జున్ కు స్వయానా మేనల్లుడు. ప్రముఖ నటి మేఘనా రాజ్ ను పెళ్లిచేసుకున్నారు. ఆయన మరణం నుంచి ఇప్పటికీ సినీ పరిశ్రమ తేరుకోలేక పోయింది.
కన్నడ యంగ్ హీరో విజయ్ సంచారి.. ఆయన స్టేజ్ నటుడి నుంచి సినిమా నటుడిగా ఎదిగాడు. చాలా ప్రతిభవంతుడు. మంచి నటుడిగా గుర్తింపు పొందారు. ఆయన కేవలం శాండిల్ వుడ్ కే పరిమితం కాకుండా టాలీవుడ్ , బాలీవుడ్ లోనూ పలు సినిమాల్లో నటించి, మెప్పించారు. సంచారి విజయ్ 2021 జూన్ 15న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
అందం, అభినయంతో ప్రేక్షకుల మనస్సు దోచుకున్న సౌందర్య.. అనూహ్యంగా హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. ఆమె మరణంతో చిత్రసీమంతా శోక సంద్రంలో మునిగిపోయారు. 2004 ఏప్రిల్ 17న బెంగళూరు నగర శివార్లలో జరిగిన విమాన ప్రమాదంలో సౌందర్య మరణించింది. మరణించే సమయానికి సౌందర్యకు 31 ఏళ్లు. ఈ శాండల్ వుడ్ భామ టాలీవుడ్ లో ప్రముఖ హీరోయిన్‌గా వెలుగొందిన సౌందర్య. కన్నడ, తమిళ, మళయాళం సినిమాల్లో సైతం మంచి నటిగా పేరుపొందింది. ఇలా కన్నడ నటులకు అకాల మృత్యువు ఎన్నో సంవత్సరాలుగా వెంటాడుతూనే ఉంది.