బ్రేక్‌ఫాస్ట్‌ హే కదా అని స్కిప్ చేస్తున్నారా.. అయితే మీకు ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉందట..!

-

బ్రేక్‌ఫాస్ట్‌ ..రోజులో మొదట చేసే పని అది. సరిగ్గా బ్రేక ఫాస్ట్ చేస్తే ఆ రోజంతా మనిషి చాలా యాక్టీవ్ గా ఉంటాడు. రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయటం ఆరోగ్యానికి చాలా మంచిదని డాక్టర్లు చెబుతుంటారు. అయితే టిఫెన్ తీనేప్పుడు మీరు తెలియకుండా కొన్ని తప్పులు చేస్తుంటారు. వాటివల్ల లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి.

breakfast

ముఖ్యంగా టిఫెన్ చేసేప్పుడు కాఫీ లేదా, జ్యూస్ తాగుతారు. మీరంతా అనుకుంటారు..పొద్దున్నే ఇవి తీసుకోవటం వల్ల పోషకపదార్థాలు బాడీకి అందుతాయ్ అని..కానీ ఇది తప్పు. వీటిల్లో యాంటియాక్సిండెట్లు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఆకలి త్వరగా వేస్తుంది. కాబట్టి బ్రేక్ ఫాస్ట్ చేసేప్పుడు కాఫీ లేదా జ్యూస్ తాగటం మంచింది కాదు.

బరువు కూడా పెరుగుతారు

చాలామంది రాత్రి లేటుగా పడుకోవటం వల్ల ఉదయం ఆలస్యంగా లేస్తారు. ఆల్మోస్ట్ లంచ్ టైం కి..ఇక అప్పుడు టిఫెన్ చేస్తే..లంచ్ ఇంకెప్పుడు చేయాలనుకుని ఆటోమెటిక్ గా టిఫెన్ స్కిప్ చేస్తారు. దీనివల్ల కూడా ఎన్నో ఇబ్బందులు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. మీకు తెలుసా బ్రేక్ ఫాస్ట్ మానేస్తే బరువు పెరుగుతారని.. అవునండి..బరువు తగ్గాలనుకునే వాళ్లు ఉదయం టిఫెన్ గట్టిగా తినాలంట.

ఇంకోటి…కొందరైతే..బ్రష్ చేయకుండా కాఫీతాగుతారు ఓకే..టిఫెన్ కూడా బ్రష్ చేయకుండా చేసేస్తారు. ఈ కరోనా కారణంగా చాలామందికి బద్దకం పెరిగిందనే చెప్పాలి. ఇలా చేయటం వల్ల తీవ్రమైన వ్యాధులు వస్తాయని వైద్య నిపుణులు చెబుతూనే ఉన్నారు. బ్రష్ చేయకుండా టిఫెన్ చేస్తే నోటినుంచి దుర్వాసన సమస్య వస్తుందట. ఇక అది వచ్చిందంటే లేనిపోని ఖర్చు. బాడీ నుంచి వచ్చే స్మెల్ అయినా కాస్త భరించవచ్చు..నోటి నుంచే దుర్వాసన వస్తే పక్కన నిలబడి మాట్లాడటానికి కూడూ ఎవ్వరూ ఇష్టపడరు.

ఈ మధ్య కొందరు బ్రేక్ ఫాస్ట్ మెనూని మార్చేశారు. డైట్ లో భాగంగా..నట్స్, మొలకెత్తిన గింజలు, గోరువెచ్చని నీళ్లు వంటివాటినే టిఫెన్ తీసుకుంటున్నారు. నిజానికి ఇది చాలా మంచిది. కానీ ఇది ఒక్కటే తిని బ్రేక్ ఫాస్ట్ అయిపోయిందంటే మాత్రం డెంజరే..ఇవి తిన్నాక కాసేపటికైనా సరే టిఫెన్ చేయాలి. ఇంకా..ప్రాసెడ్డ్ ఫుడ్ ని కూడా బ్రేక్ ఫాస్ట్ గా తీసుకునే అలావాటు ఉంటే ముందు అది మానేయండి. దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.

ఇదండి మ్యాటర్..మీలో ‌ఎవరికైనా బ్రేక్ ఫాస్ట్ చేసే అలవాటు లేకపోతే..ఇప్పటికైనా మార్చుకోండి. ప్రతిరోజు ఉదయం టిఫెన్ చేయటం మీ దినసరి చర్యలో భాగంగా మార్చుకోవాలి. టిఫెన్ చేస్తేనే మీ రోజంతా యాక్టీవ్ గా ఉంటారు. బ్రేక్ ఫాస్ట్ ఆలస్యంగా చేయటం లేదా మొత్తానికే మానేయటం లాంటి అలావట్లను మానేస్తేనే మంచిది. కొంచేం అయినా పర్వాలేదు టిఫెన్ అయితే చేయండి..అప్పుడే మీకు భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని వైద్యులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news