‘కన్నప్ప’ మూవీ టీజర్ రిలీజ్ ఎప్పుడంటే..?

-

గత కొన్ని సంవత్సరాలుగా హిట్ కోసం ప్రయత్నిస్తున్న మంచు విష్ణుకి సక్సెస్ అందకపోవడంతో ఈసారి ఎలాగైనా మంచి విజయాన్ని అనుకోవాలని భావిస్తున్నాడు.మహా భారతం సీరియల్‌ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో విష్ణు మంచు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం భక్త కన్నప్ప. మంచు విష్ణు కి ఇది డ్రీమ్ ప్రాజెక్ట్‌. మోహన్ బాబు,మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా వైడ్‌గా రాబోతోన్న ఈ సినిమాని మోహన్ బాబు నిర్మిస్తున్నారు.ఇది వరకు ఎన్నడూ చూడని ఓ దృశ్యకావ్యంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అంచనాలున్నాయన్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే… ఈ సినిమా టీజర్ ఈనెల 14న రిలీజ్ కానుంది. కేన్స్లో ‘కన్నప్ప’ టీజర్కు మంచి రెస్పాన్స్ లభించిందని, దీనిని ప్రేక్షకులతో పంచుకునేందుకు ఎదురుచూస్తున్నట్లు మంచు విష్ణు తెలిపారు. ఈ సినిమా తన హృదయంలో ఎంతో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని వెల్లడించారు. ఈ సినిమాలో ప్రభాస్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news