SK వర్సిటీలో వైఎస్ఆర్ విగ్రహం తొలగింపు

-

గత ఐదేళ్లు ఏపీలో సాగించిన అరాచక పాలనతో వైసిపి బీభత్సం సృష్టించింది.దీంతో ఆ పార్టీ ఎన్నికల ఫలితాల్లో కనీవిని ఎరగని రీతిలో ఓటమి పాలయింది.వైఎస్ జగన్‌ నియంతృత్వ పాలనకు రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడుతూ.. తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమికి పట్టం కట్టారు.కూటమి దెబ్బకు వైసిపి పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. ఇక ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టబోతున్న నేపథ్యంలో టిడిపి శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా పలు విధ్వంసంలు సృష్టిస్తున్నారు.

తాజాగా అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో వైఎస్ఆర్ విగ్రహాన్ని అధికారులు తొలగించారు. 6 నెలల క్రితం క్యాంపస్లో విగ్రహం ఏర్పాటు చేయగా, పాలకమండలి ఆమోదం లేకుండానే విగ్రహాన్ని ఏర్పాటు చేశారంటూ అప్పట్లో విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రానున్న నేపథ్యంలో విగ్రహాన్ని తొలగించారు. మరోవైపు నెల్లూరు విక్రమ సింహపురి వర్సిటీలో వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటుపై తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news