అన్నారం బ్యారేజీ మరమ్మత్తు పనులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. బ్యారేజీ దగ్గర జరుగుతున్న పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అన్నారం బ్యారేజికి నీటి ప్రవాహ ఒత్తిడి ఎక్కువని అన్నారం బ్యారేజ్ కి బ్యాక్ వాటర్ లేక బ్యారేజ్ పై ఒత్తిడి పెరిగిందని అధికారులు ఉత్తమ్ కు చెప్పారు.
అన్నారం బ్యారేజ్ నిర్మాణంలో లోపాలు ఉన్నాయని ఇదివరకే చెప్పిన ప్రభుత్వ పెద్దలు అప్పట్లో మా ప్రతిపాదనలు పట్టించుకోలేదు. అన్నారం బ్యారేజీకి ముంపు సమస్య ఎక్కువ . అయినా అప్పట్లో ప్రభుత్వ పెద్దలు వినలేదు అని మంత్రి ఉత్తమ్ కు తెలిపారు. అధికారులు. ఇసుక తొలగించాం.. 600 మీటర్లు సర్వే ,.. టెస్టులు చేశామని తెలిపారు.అన్నారం బ్యారేజ్ పనులను పరిశీలన అనంతరం అక్కడి నుంచి నేరుగా మేడిగడ్డకు వెళ్లి పనుల పురోగతిపై సమీక్ష చేసి ఆ తర్వాత మీడియాతో మాట్లాడానున్నారు.