ప్రముఖ కన్నడ హీరో కం డైరెక్టర్ రిషబ్ శెట్టి తన స్వీయ దర్శకత్వంలో హీరోగా తెరకెక్కించిన చిత్రం కాంతారా.. ప్రస్తుతం ఎక్కడ చూసినా దేశవ్యాప్తంగా ఈ సినిమా గురించే వార్తలు వినిపిస్తున్నాయి. భాషతో సంబంధం లేకుండా విడుదలైన అన్ని భాషల్లో కూడా ఒకే విధంగా రెస్పాన్స్ ను అందుకోవడం మాత్రమే కాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల వర్షం కురిపిస్తూ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది. కర్ణాటకలోని ఆదివాసి సంస్కృతిని, సాంప్రదాయాన్ని భూతకోల నృత్య కళాకారులను తెరపై చూపించిన తీరు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది . ఇక ఆ పాత్రలో రిషబ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
కేవలం దక్షిణాది భాషల్లో మాత్రమే కాకుండా ఉత్తరాదిలో కూడా మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. అంతేకాదు బాహుబలి 2 రికార్డులను కూడా బ్రేక్ చేసింది ఈ సినిమా. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. ఈ సినిమాపై కర్ణాటక ప్రభుత్వం ఒక సంచల నిర్ణయం తీసుకుందని చెప్పాలి. ఇక ఈ నిర్ణయం వల్ల కాంతరా సినిమా ద్వారా ఎంతో మంది జీవితాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పవచ్చు. ఈ సినిమా విడుదల తర్వాత కర్ణాటక ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది . 60 సంవత్సరాలు దాటిన భూతకోల నృత్యకారులకు ఆర్థిక సహాయం అందించనున్నట్టు తెలిపింది. ఇక అర్హులైన వారికి నెలకు రూ.2000 చొప్పున భత్యం అందించనున్నట్లు కూడా కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది.
అంతేకాదు ఇదే విషయాన్ని బెంగళూరు సెంట్రల్ ఎంపీ పిసి మోహన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దైవారాధన, భూత కోలా నృత్యం చేస్తూ జీవనం సాగిస్తున్న వారికి బిజెపి నేతృత్వంలోని కర్ణాటక సర్కార్ ప్రతినెల 2000 రూపాయలను అలవెన్స్ రూపంలో అందిస్తుందని వెల్లడించారు. ఇక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కి మంత్రి సునీల్ కుమార్ కాకర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ పిసి మోహన్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్ కూడా బాగా వైరల్ అవుతుంది. ఏది ఏమైనా ఒక సినిమా ప్రజల జీవితాలను మార్చేసింది అని చెప్పడంలో సందేహం లేదు.
60 ವರ್ಷ ಮೇಲ್ಪಟ್ಟ ದೈವ ನರ್ತಕರಿಗೆ ಪ್ರತಿ ತಿಂಗಳು 2000 ರೂ. ಮಾಸಾಶನ ನೀಡುವುದಾಗಿ ಘೋಷಿಸಿದ ಸನ್ಮಾನ್ಯ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾದ ಶ್ರೀ @BSBommai ಅವರ ನೇತೃತ್ವದ ಕರ್ನಾಟಕ ಸರ್ಕಾರಕ್ಕೆ ಮತ್ತು ಸಚಿವರಾದ ಶ್ರೀ @karkalasunil ರವರಿಗೆ ಧನ್ಯವಾದಗಳು. pic.twitter.com/PrVjV2YAEf
— P C Mohan (@PCMohanMP) October 20, 2022