టీవి లో కూడా కాంతారా కు అదిరిపోయే రెస్పాన్స్.!

-

డిఫెరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన  కన్నడ డబ్బింగ్ సినిమా కాంతారా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొంటున్న సంగతి అందరికి తెలిసిందే. దీపావళి కు నాలుగు సినిమాలు రిలీజ్ అయినా కూడా, ఈ సినిమా హౌస్ ఫుల్స్ తో విపరీత మైన కలెక్షన్లు వసూలు చేసింది. తెలుగు సినిమాలు అన్నీ కాంతారా చేతిలో ఓడిపోయా యి ఇప్పటికే పెట్టుబడికి ఎన్నో రెట్లు అధికంగా డబ్బులు రాబట్టింది.

సినిమా చూసిన ప్రతి ఒక్కరు అద్భుతంగా ఉందని , ఈ సినిమా  చూస్తున్నంత సేపు మరో లోకంలో వున్నట్లుగా అనిపించిందని,అలాగే క్లైమాక్స్ లో గూస్ బంప్స్ వచ్చి ఒళ్ళు జలదరించింది అని చాలా మంది సెలబ్రిటీలు కాంతారా ఎక్స్పీరియన్స్ ను కళ్ళకు కట్టినట్లు గా చెప్పారు. ఇక మామూలు ఆడియన్స్ కూడా అదే ఎక్స్పీరియన్స్ చవి చూశారు.ఇక ఓ టి టి లో కూడా రికార్డ్స్ క్రియేట్ చేసింది.

తాజాగా గత వారం వరల్డ్ ప్రీమియర్ గా మా టీవీ లో సందడి చేసింది. ఇప్పుడు దీని లో కూడా అరుదైన రికార్డ్ నెలకొల్పింది.ఈ చిత్రానికి 12.3 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఇది బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అని చెప్పాలి. బుల్లితెర పై కూడా ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం అద్బుతం అనే చెప్పాలి. ఇక ఈ సినిమా ఆస్కార్ అవార్డు రేసులో చివరి మెట్టు వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ చిత్రం రెండో భాగం కోసం స్క్రిప్ట్ వర్క్ కూడా ప్రిపేర్ అవుతున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news