ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే సీన్ ఆస్కార్ ప్రోమో లో.!

-

RRR గ్యాప్ లేకుండా రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా లాస్ ఏంజెల్స్ లో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఫంక్షన్ లో  బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ‘నాటు నాటు’ సాంగ్ కు గానూ ఆర్ ఆర్ ఆర్ మూవీ  గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ సాధించింన  సంగతి అందరికీ తెలిసిందే. దాని తర్వాత  నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు రేసులో షార్ట్ లిస్ట్ కు కూడా ఎంపిక అయ్యింది. ప్రపంచంలో ప్రతిష్టాతకంగా భావించే ఆస్కార్ అవార్డుల్లో RRR అవార్డు తెస్తుందని భావిస్తున్నారు. దాని కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక తాజాగా  95వ ఆస్కార్ అవార్డ్స్ అఫీషియల్ ప్రోమోను అకాడమీ విడుదల చేసింది. ట్విట్టర్ ది అకాడమీ అఫిషియల్ అకౌంట్ లో 31 సెకన్ల నిడివి ఉన్న వీడియోను విడుదల చేశారు.అయితే ఇందులో ఎన్టీఆర్ ఫ్యాన్స్  కాలర్ ఎగరేసే విషయం ఉంది.95వ ఆస్కార్ అవార్డ్స్ అఫీషియల్ ప్రోమోలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించి సందడి చేస్తున్నారు.ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ ఫైట్ సీన్ ను ఆస్కార్ ప్రోమోలో పెట్టారు.

ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ ఫైట్ లో ఒక బైక్ ను ఎన్టీఆర్ కాలితో తన్ని పైకి లేపి గిరగిరా తిప్పి విసిరేసే షాట్ ప్రేక్షకులను అమితంగా అలరించింది. ఇప్పుడు ఇదే సీన్ ను ప్రోమోలో అస్కార్ వారు ఉంచారు. ఇప్పుడు అదే జూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో జోష్ కు కారణం అయ్యింది. ఇక సోషల్ మీడియాలో ఒకటే సందడి నెలకొంది. జూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ తో హంగామా చేస్తున్నారు. RRR అవార్డు కోసం మార్చి 13 తేది కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

 

Read more RELATED
Recommended to you

Latest news