దిల్లీ లిక్కర్ స్కామ్.. ఈడీ ఛార్జిషీట్‌లో కేజ్రీవాల్‌, కవిత ప్రస్తావన

-

దిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో ఈడీ సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది.ఈ ఛార్జ్ షీట్ ను రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఛార్జిషీట్‌లో పేర్కొన్న నిందితులకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 23కి వాయిదా వేసింది.

ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషీట్‌లో కీలక వ్యక్తుల ప్రమేయం గురించి ప్రస్తావన వచ్చింది. ఇందులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత ప్రమేయం గురించి ప్రస్తావించింది. ఎమ్మెల్సీ కవిత అనుచరుడు వి.శ్రీనివాసరావును విచారించినట్టు ఈడీ వివరించింది. వి.శ్రీనివాసరావు వాంగ్మూలాన్ని ఛార్జిషీట్‌లో ప్రస్తావించింది. కవిత ఆదేశంతో అరుణ్‌పిళ్లైకి శ్రీనివాసరావు రూ.కోటి ఇచ్చారని ఈడీ వెల్లడించింది.

ఈ కేసుకు సంబంధించి జనవరి 6న 13,657 పేజీల అనుబంధ ఛార్జిషీట్‌ను దాఖలు చేసిన ఈడీ ఐదుగురిపేర్లు, ఏడు కంపెనీలను చేర్చింది. విజయ్‌నాయర్‌, అభిషేక్‌ బోయినపల్లి, శరత్‌ చంద్రారెడ్డి, బినోయ్‌బాబు, అమిత్‌ అరోరాలను నిందితులుగా చేర్చింది. సౌత్‌గ్రూప్‌ లావాదేవీల్లో శరత్‌ చంద్రారెడ్డి, అభిషేక్‌, విజయ్‌ నాయర్‌ కీలక వ్యక్తులుగా ఉన్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news