నైతికంగా నేనే విజయం సాధించా… మంత్రులు తలలు ఎక్కడ పెట్టుకుంటారు..- టీఆర్ఎస్ రెబల్ రవీందర్ సింగ్

నైతికంగా నేనే విజయం సాధించానని టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి రవీందర్ సింగ్ అన్నారు. బీసీ బిడ్డలు, దొరలకు మధ్యలో జరిగిన పోటీలో నేను కూడా ఉన్నానని అన్నారు. భానుప్రసాద్ కు 584 ఓట్లు వస్తే, ఎల్ రమణకు 479 ఓట్లు వచ్చాయని అయన వెల్లడించారు. నేను అనుకున్నది నెరవేరిందని.. నాకు 232 ఓట్లు వచ్చాయని.. మరో 32 ఓట్లు వస్తే రెండో ప్రాధాన్యతకు వెళ్లే వాడినని రవీందర్ సింగ్ చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో నైతిక విజయం నాదే అని రవీందర్ సింగ్ అన్నారు. జిల్లాలో 2 లక్షల మంది మద్దతు తనకు ఉందని నిరూపితం అయిందన్నారు.  నైతికంగా టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని వెల్లడించారు. మంత్రులు తలలు ఎక్కడ పెట్టుకుంటారనిన ప్రశ్నించారు. మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

కాగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రారంభం నుంచి కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానం రాజకీయంగా అందరిని ఆకర్షిస్తోంది. టీఆర్ఎస్ పార్టీ కీలక నేత, మాజీ మేయర్ రవీందర్ సింగ్ రెబల్ అభ్యర్థిగా పోటీలో నిలవడం.. ఆయనకు బీజేపీ మద్దతు ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా.. రవీందర్ సింగ్ ఎన్నికలక సమయంలో ఎదైనా మ్యాజిక్ చేస్తారా .. అని అందరూ భావించారు. అయితే రవీందర్ సింగ్ ఓడిపోయినా.. ఈ స్థాయిలో ఓట్లు తెచ్చుకోవడం టీఆర్ఎస్ పార్టీకి మింగుడు పడని విషయంగా ఉంది.