ఇండోనేషియాను కుదిపేసిన శక్తివంతమైన భూకంపం… సునామీ హెచ్చరికలు జారీ…

-

ఇండోనేషియా దేశాన్ని శక్తివంతమైన భూకంపం కుదిపేసింది. అధికారులు సునామీ హెచ్చిరికలు కూడా జారీ చేశారు. రిక్టర్ స్కేల్ పై 7.6 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. మంగళవారం తూర్పు ఇండోనేషియాలో ఈ భూకంపం సంభవించింది. శక్తివంతమైన భూకంపం రావడంతో అధికారులు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. భూకంప కేంద్రం ఇండోనేషియాలోని తూర్పు నుసా టెంగ్‌గారా ప్రావిన్స్‌లోని ఫ్లోర్స్ ద్వీపానికి ఉత్తరంగా ఉంది. ఫ్లోర్స్ సముద్రంలో 18.5 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని, మౌమెరే పట్టణానికి ఉత్తరాన 100 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

దాదాపు 30 సెకన్ల పాటు భారీగా భూప్రకంపనాలు రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మరోవైపు సునామీ అలలు వచ్చే అవకాశం ఉండటంతో సముద్ర తీరానికి దూరంగా వెళ్లాలని ప్రజలను అధికారులు హెచ్చిరించారు. ఇండోనేషియాలోని మలుకు, తూర్పు నుసా టెంగ్‌గారా, వెస్ట్ నుసా టెంగ్‌గారా మరియు ఆగ్నేయ మరియు దక్షిణ సులవేసి ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news