కేంద్రంలో ప్రస్తుతం బీజేపీ గత రెండు పర్యాయాలు నుండి అధికారంలో ఉంది. బీజేపీ ఎంత సాధించినప్పటికీ దక్షిణ భారతదేశములో అధికారంలోకి రాలేకపోతుండటం వారు చాలా మనోవేదనకు గురవుతున్నారు. అయితే ఈసారి జరగనున్న ఎన్నికల్లో అయినా అధికారాన్ని దక్కించుకోవాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. దక్షిణ భారతంలో ఉన్న రాష్ట్రాలలో ఒక్క కర్ణాటక లో మాత్రమే బీజేపీ అధికారంలో ఉంది.
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు మరియు కేరళలో ఎంత ప్రయత్నించినా బీజేపీకి కష్టమే. కాగా కర్ణాటక లో రానున్న మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్ ఈ రోజు ఉదయం 11.30 గంటలకు విడుదల చేయనుంది. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం సీఎంగా ఉన్న బసవరాజు బొమ్మై తన వ్యూహాలతో, ఎత్తుకు పై ఎత్తులతో మళ్లీ బీజేపీ ని అధికారంలోకి తీసుకురాగలడా చూడాలి. అదే సమయంలో కాంగ్రెస్ మరియు జేడీఎస్ లు పొత్తులు పెట్టుకుని అధికారంలోకి రావాలని చూస్తున్నాయి. మరి ఈ ఎన్నికల సమరంలో గెలుపు ఎవరిదో తెలియాలంటే మే వరకు ఆగాల్సిందే.