మహారాష్ట్ర తీర్మానంపై కర్ణాటక సీఎం బొమ్మై ఫైర్

-

మంగళవారం మహారాష్ట్ర అసెంబ్లీ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మరాఠీ భాష మాట్లాడే కర్ణాటకలోని 865 గ్రామాలను మహారాష్ట్రలో కలపనున్నారు. దీనికి సంబంధించిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. కర్ణాటకతో బోర్డర్ సమస్య ఉత్పన్నం అవుతున్న నేపథ్యంలో సీఎం ఏక్ నాథ్ షిండే ఈ నిర్ణయం తీసుకున్నారు. సరిహద్దు వివాదం మహారాష్ట్ర రాజేశిన అంశమే అని పేర్కొంటూ కర్ణాటక అసెంబ్లీ గత గురువారం ఏకగ్రీవంగా తీర్మానించింది. రాష్ట్రంలోని అంగుళం భూమి కూడా మహారాష్ట్రకు ఇచ్చేది లేదని స్పష్టం చేసింది.

ఇది ఇరు రాష్ట్రాల మధ్య తీవ్రమైన మాటల యుద్ధానికి దారితీసింది. సరిహద్దులోని 865 గ్రామాలను మహారాష్ట్రలో విలీనం చేయాలని ఆ రాష్ట్ర శాసనసభలో చేసిన తీర్మానాన్ని కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై తీవ్రంగా ఖండించారు. మహారాష్ట్ర లక్ష్మణ రేఖ దాటిందని విమర్శించారు. సరిహద్దు వివాదంలో మహా జన్ కమిషన్ ఇచ్చిన నివేదికే అంతిమం అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ తీర్మానం వెనుక రాజకీయ కోణం కనిపిస్తుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు బసవరాజు బొమ్మై.

Read more RELATED
Recommended to you

Latest news