కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య.. ఈనెల 20న ప్రమాణ స్వీకారం

-

కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కుతుందోనన్న అంశంపై ఎట్టకలేకు చిక్కుముడి వీడింది. కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అగ్రనేత సిద్ధరామయ్య బాధ్యతలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించనున్నారు. బుధవారం అర్ధరాత్రి వరకు జరిగిన విస్తృత మంతనాల అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

బెంగళూరులో మే 20న సిద్ధరామయ్య ముఖ్యంత్రిగా ప్రమాణస్వీకార చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీఎల్పీ సమావేశం ఏర్పాటుకు పార్టీ ఆదేశించింది. ఈ క్రమంలో బెంగళూరులో ఇవాళ రాత్రి 7 గంటలకు సీఎల్పీ మీటింగ్ జరగనుంది. సెంట్రల్ అబ్జర్వర్లు వెంటనే బెంగళూరుకు చేరుకోవాలని పార్టీ ఆదేశించింది.

పార్టీ దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా కర్ణాటక సీఎం పీఠం సిద్ధరామయ్యకే అప్పజెప్పేందుకే కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. మరోవైపు.. బెంగళూరులోని సిద్ధరామయ్య ఇంటి వద్ద భద్రతను పోలీసులు మరింత పెంచారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య బాధ్యతలు స్వీకరించునున్నారన్న వార్తల నేపథ్యంలో ఆయన ఇంటికి భారీగా అభిమానులు, కార్యకర్తలు చేరుకున్నారు. బాణసంచా పేల్చి.. డ్యాన్స్​లు వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news