కరోనా కారణంగా ప్రపచవ్యాప్తంగా పలు హృదయవిదారక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కర్ణాటకలోని బెలగావి జిల్లాలో అలాంటి ఘటనే చోటు చేసుకున్నది. అథాని టౌన్‌లో నివసించే 55 ఏళ్ల సదాశివ్ కొన్నాళ్లుగా హృద్రోగ సమస్యతో బాధపడుతున్నాడు. అయితే బంధువులకు సంబంధించిన ఓ ఫంక్షన్‌లో పాల్గొనేందుకు బుధవారం రాత్రి అతడిని ఇంట్లో ఒక్కడినే వదిలేసి.. భార్య, కొడుకు, కూతురు చిక్కట్టి పట్టణానికి వెళ్లాల్సివచ్చింది. అయితే వారు తిరిగొచ్చే సరికి సదాశివ మరణించాడు.
#WATCH Karnataka: Body of a man was carried on a cart by his family, for last rites, in Belagavi's Athani Taluk after they allegedly received no help from anyone. They allegedly received no help from others following a suspicion that the deceased was COVID-19 positive. (17.07) pic.twitter.com/eRkeBDSB4v
— ANI (@ANI) July 18, 2020
దీంతో ఆ కుటుంబసభ్యులు బంధువులకు, ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇచ్చారు. అయితే కరోనా మరణామేమో అనే భయంతో ఎవరూ ముందుకు రాలేదు. తన భర్తకు చాలా కాలం నుంచి హార్ట్ ప్రాబ్లమ్ ఉందని, ఆయన గుండెపోటుతోనే మరణించాడని, సాయం చేయాలని కోరినా ఏ ఒక్కరూ ధైర్యం చేయలేదు. దీంతో కుటుంబసభ్యులే తోపుడు బండిపై శవాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.